మధ్య తరగతి ప్రజల కోసం సరికొత్త పథకం తీసుకు రానున్న కేంద్ర ప్రభుత్వం!

దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోడీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పధక రచనలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.తాజాగా మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగే అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

 The Central Government Will Bring A New Scheme For The Middle Class People , Cen-TeluguStop.com

నివేదికల ప్రకారం చూస్తే.PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), NSC (నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్), KVP (కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా ఈ నెల చివరిలో ఈ అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోనుందని భోగట్టా.

అవును, కేంద్ర ప్రభుత్తం ప్రతి త్రైమాసికం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను సమీక్షిస్తూ రావడం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు తాజాగా RBI ఈ ఏడాది రెపో రేటును 225 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.ఈ క్రమంలో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరుగుతూ వున్నాయి.అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను పెంచొచ్చని మార్కెట్ పండితులు చెబుతున్నారు.2023 జనవరి – మార్చి త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

Telugu Central, Latest, Scheme, Peoples-Latest News - Telugu

ఇదేగాని నిజమైతే మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది కానుక అందించినట్లు అవుతుంది.కాగా కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో సేవింగ్స్ పెరగాలనే లక్ష్యంతో చిన్న మొత్తాల పొదుపు పథకాలు వంటివి అందుబాటులో ఉంచిన సంగతి కూడా విదితమే.కాగా వీటిల్లో రెగ్యులర్‌గా డబ్బులు పొదుపు చేయడం ద్వారా లాభపడొచ్చు.ఇక స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనేవి 3 రకాలుగా అంటే సేవింగ్స్ డిపాజిట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ రూపాలలో ఉంటాయి.

వీటిల్లో ప్రజలు వారికి నచ్చిన పథకాన్ని ఎంచుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.మెచ్యూరిటీ సమయంలో ఆకర్షణీయ రాబడి పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube