తెలుగు సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత అదే ఊపుతో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బాహుబలి సినిమా తర్వాత బాహుబలి 2, రాధేశ్యామ్, సాహో, వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె , సినిమాలతో పాటుగా మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇలా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నాడు ప్రభాస్.వీటితోపాటుగా సందీప్ రెడ్డి వంగా తో కలిసి స్పిరిట్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాను పాన్ రేంజ్ లో 8 భాషల్లో రూపొందిస్తున్నారు.ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.
ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్,సలార్ సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఏమిటంటే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లు తెరకెక్కబోతున్న స్పిరిట్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన కథను డైరెక్టర్ నయనతార కు వినిపించడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరూ కలిసి యోగి సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.యోగి సినిమా విడుదల ఇప్పటికి దాదాపు 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది.15 ఏళ్ల తర్వాత నయనతార ప్రభాస్ మళ్ళీ కలిసి నటించబోతున్నారు.







