తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ హీరో మహేష్ బాబు హీరోగా నటించిన 1నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలలో నటించి హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది కృతి సనన్.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనక సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటూ ఉంటుంది కృతి సనన్.
ఇది ఇలా ఉంటే కృతి సనన్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో విషయాలను పంచుకుంది.ఈ నేపథ్యంలోనే తనకు కాబోయే వరుడుకి ఎటువంటి లక్షణాలు ఉండాలో చెప్పుకొచ్చింది కృత్రి సనన్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.చిన్నప్పుడు, ప్రేమంటే తెలియని వయసులో క్రష్‌లు ఉండడం సహజమే.
నేను కూడా రెండు మూడు సార్లు ఆ అనుభూతిలో విహరించాను.కానీ అప్పట్లో నేను భయస్తురాలిని.

ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు.నేను ఇష్టపడిన అబ్బాయిల దగ్గర కూడా నోరు మెదపలేకపోయాను.కాకపోతే ఆ మూమెంట్స్ అన్నీ నాకు గుర్తుకు ఉన్నాయి.కాబోయే వాడు ఎలా ఉండాలి అన్న దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది.కాబోయే భర్త నాకంటే పొడవు ఉండాలి.అందగాడు కావాలి.
మంచి మాటకారై ఉండాలి.తనతో ఎప్పటికీ నాకు బోర్ కొట్టకూడదు అంటూ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చింది.







