తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఇందులో భాగంగా మొత్తం ఐదు రోజుల పాటు హస్తినాలో మకాం వేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.ఈ క్రమంలో సీఎం భద్రత ఏర్పాట్లతో పాటు కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ పరిశీలిస్తున్నారు.
బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ జాతీయ విధానం, జాతీయ కార్యవర్గం, కమిటీలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.







