నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేలుడు కలకలం చెలరేగింది.పెద్ద బజార్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కెమికల్ బాక్స్ ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న సీపీ నాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
బ్లాస్ట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.