రాత్రికి రాత్రే ధనవంతులైన 165 మంది..ఇంతకీ ఏం జరిగిందంటే

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు.దేనికైనా రాసిపెట్టి ఉండాలి.

 165 People From Belgium Village Wins 1200 Crores Lottery Details, Lottery, Viral-TeluguStop.com

లాటరీలో కూడా ఒకేసారి కోటాను కోట్లు జాక్ పాట్ కొట్టే వారి గురించి అప్పుడప్పుడూ వార్తల్లో వింటూ ఉంటాం.ఇదంతా సాధారణ విషయాలే.

అయితే ఒకేసారి రికార్డు స్థాయిలో ఒక ఊర్లో వందలాది మందికి లాటరీ తగిలితే కచ్చితంగా ఆశ్చర్యపోతాం.ఓకే గ్రామానికి చెందిన 165 మంది ఒకేసారి రాత్రికి రాత్రే అదృష్టవంతులయ్యారు.165 మంది కోట్లాది రూపాయలను లాటరీ ద్వారా గెలిచారు.దీంతో ఆ గ్రామంలోని అందరి తలరాత మారిపోయింది.గ్రామంలోని 165 మంది లాటరీ ద్వారా గెలిచిన సొమ్ము విలువ దాదాపు రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా.

గ్రామంలో లాటరీ గెలిచిన ప్రతి ఒక్క వ్యక్తీ రూ.7.5 కోట్లకు పైగా నగదును పొందారు.ఈ సంఘటన బెల్జియంలో చోటుచేసుకుంది.

యూరప్‌లోని ఆంట్‌వెర్ప్ ప్రావిన్స్‌ ప్రాంతంలో ఓల్మెన్ అనే చిన్న గ్రామం ఉంది.ఇక్కడి ప్రజలకు లాటరీ కొనడం అలవాటు.

గ్రామంలోని 165 మంది లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశారు.అయితే లాటరీని కొనుగోలు చేసేందుకు ఆ వ్యక్తులు ఒక్కొక్కరు రూ.1,308లు చెల్లించి ఒక్కటిగా టికెట్ కొన్నారు.

Telugu Lottery, Belgium, Belgium Lottery, Europe, Lucky, Latest-Latest News - Te

ఆ టిక్కెట్ కు గత మంగళవారం ఫలితాలు వచ్చి లక్కీ డ్రాగా తేలింది.గ్రామస్తులంతా కూడా మొత్తంగా 123 మిలియన్ పౌండ్లను ప్రైజ్ మనీగా సాధించారు.భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.1,200 కోట్లుగా ఉంది.అయితే ఇలా గ్రామస్తులంతా కలిసి లాటరీ టిక్కెట్ కొనుగోలు చేయడం ఇదేమీ తొలిసారి కాదని, దీనికి ముందు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని పలువురు చెబుతున్నారు.

జులైలో కూడా ఓ వ్యక్తి 195 మిలియన్ పౌండ్ల ప్రైజ్ మనీని గెలుపొందినట్లు వెల్లడించారు.భారత కరెన్సీ ప్రకారంగా ఆ లాటరీ టిక్కెట్ విలువ ఏకంగా రూ.19 వేల కోట్లు కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube