ప్రపంచంలోనే 500 టాప్ కంపెనీల్లో భారత్ వి ఎన్నున్నాయో తెలుసా? రిలయన్స్ ప్లేస్ అదే

ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా భారత్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా టాప్ కంపెనీలతో పోటీ పడుతున్నాయి.వరల్డ్ లోనే అత్యంత విలువైన 500 కంపెనీల లిస్ట్ లో భారత కంపెనీలు కూడా 20 ఉండటం విశేషం.

 Hurun Report 20 Indian Firms In 500 Most Valuable Globally Reliance Top,reliance-TeluguStop.com

ఈ 20 భారత కంపెనీల విలువ 202 బిలియన్ డాలర్లు ఉంటుంది.ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లైతే ముకేశ్ అంబానీకి చెందిన భారత కంపెనీ అయిన రిలయన్స్ 34వ స్థానంలో ఉంది.

హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా తన నివేదికను విడుదల చేసింది.టాప్ 500 కంపెనీల లిస్ట్ ను పొందుపరిచింది.

ఈ జాబితాలో మొదటి స్థానంలో యాపిల్ కంపెనీ ఉండగా రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది.

Telugu Adani, China, Hurun, India, Indian Firms, Reliance, Top, Latest-Latest Ne

ఇకపోతే భారత్ లో రిలయన్స్ కంపెనీ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండో స్థానంలో నిలిచింది.టీసీఎస్ మార్కెట్ విలువ ప్రస్తుతం 139 బిలియన్ డాలర్లుగా ఉంది.అదానీ గ్రూప్ కు చెందినటువంటి మరో నాలుగు కంపెనీలు టాప్ 500 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ వంటి కంపెనీలో ఈ జాబితాలో నిలిచాయి.ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యాపిల్ తర్వాత మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, టెస్లా, బెర్క్ షైర్ హాత్ వే, జాన్సన్ అండే జాన్సన్, ఎక్సాన్ మొబిల్ వంటి కంపెనీలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

ఇకపోతే అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా సౌదీ ఆరామ్ కో నిలిచింది.ప్రస్తుతం ఆ కంపెనీ విలువ 2.03 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.భారత్ లో ఎస్బీఐ 62 బిలియన్ డాలర్లు, ఎల్ఐసీ 45 బిలియన్ డాలర్లుతో కొనసాగుతున్నాయి.

అయితే ఇవేవీ హురున్ 500 జాబితాలో ఉండువు.ఎందుకంటే ఆ నివేదిక కేవలం ప్రైవేటు కంపెనీలకు మాత్రమే చెందినది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను పొందుపరచలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube