అదృష్ట దేవతను పడకగదికి తీసుకెళ్లి అలా మార్చాలి.. నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు!

తాజాగా కన్నడ హీరో ఒక ఇంటర్వ్యూలో భాగంగా అదృష్ట దేవతపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమను ఊపేస్తున్నాయి.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి.

 Kannada Star Darshan Controversial Comments On Goddess Luck , Kannada Star , Her-TeluguStop.com

కన్నడ హీరో దర్శన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ.

అదృష్ట దేవత ప్రతిసారి తలుపు తట్టదు.తలుపు తట్టినప్పుడు చేయి పట్టుకుని బెడ్రూంలోకి లాకెల్లాలి.

ఆమె బట్టలు విప్పి నగ్నంగా చేయాలి.బట్టలిస్తే అవి ధరించి బయటికి వెళ్ళిపోతుంది అంటూ కామెంట్స్ చేశాడు.

అయితే హిందువులు అదృష్ట దేవతగా భావించే శ్రీ లక్ష్మీ ని పూజిస్తారు.

లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య అన్న విషయం తెలిసిందే.

అయితే హీరో దర్శన్ చేసిన కామెంట్స్ హిందూ వర్గాల మన భావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి అంటూ పలువురు మహిళా సంఘాలు కూడా ఒక స్త్రీని వివస్త్రను చేయాలి అని ఎలా చెబుతారు అంటూ దర్శన్ పై మండిపడుతున్నారు.దర్శన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

హిరో దర్శన్ పై పలువురు సోషల్ మీడియా వేదికగా మండిపడుతూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.అయితే ఇంకొందరు మాత్రమే దర్శన్ కి అనుగుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

అదృష్టం వచ్చినప్పుడు దానిని వదిలేయకుండా ఒడిసి పట్టుకోవాలి అన్న అర్థంతో దర్శన్ ఆ విధంగా కామెంట్స్ చేసి ఉంటాడు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Goddess Lakshmi, Darshan, Kannada, Kannadadarshan, Lord Vishnu-Movie

అయితే దర్శన్ ఆ కామెంట్స్ ని దేనిని ఉద్దేశించి చేసిన అవి మాత్రం ప్రస్తుతం వివాదానికి కారణం అయ్యాయి.మరి ఈ వార్తలపై దర్శనం ఏ విధంగా స్పందిస్తాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వివరణ ఇస్తాడా లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు చెబుతాడా అన్నది చూడాలి మరి.ఇకపోతే దర్శన్ కెరియర్ విషయానికి వస్తే.మొదట కెమెరా అసిస్టెంట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దర్శన్ కెరియర్ మొదట్లో చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ చేశాడు.

ఇక 2001లో విడుదలైన మెజిస్టిక్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ కన్నడ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube