సినీ ప్రేక్షకులకు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.
రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది వరలక్ష్మి శరత్ కుమార్.
అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఇది ఇలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె ట్విట్ చేస్తూ.పదేళ్ల తన సినీ కెరియర్ అంత సులభంగా సాగలేదని, కెరియర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది.
బాడీ షేమింగ్ విషయంలో కూడా బొద్దుగా ఉన్నావు ఫేస్ లో ఆకర్షణ లేదు అంటూ ఎన్నో అవమానాలకు గురి చేశారు అని ఆమె చెప్పుకొచ్చింది.అటువంటి అవమానాలు తనని ఆపలేదని, ఆ విషయాల నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.
అంతే కాకుండా పదేళ్లలో తాను 45 సినిమాలలో నటించినట్టు ఆమె చెప్పుకొచ్చింది.ఈ పదేళ్లలో కూడా ఎక్కువగా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే చేసుకుంటూ వస్తున్నాను.

మరీ ముఖ్యంగా విలన్ క్యారెక్టర్లలో ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు.కానీ నిజం చెప్పాలి అంటే విలన్ గా నటించడం చాలా కష్టం.అటువంటి కష్టమైన పాత్రలో నటించగలనని నిరూపించుకున్నాను.ఇన్నేళ్ల నా సినీ కెరియర్ ను వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి అనుభూతికి లోనవుతున్నాను.నాలో ఉన్న నటనను చాటుకునే విధంగా పలు అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం విరామం లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాను.
ప్రస్తుతం నేను నా కెరియర్ తో చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.
.