మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సత్యదేవ్ హీరో గా రూపొందిన చిత్రం గుర్తుందా శీతాకాలం.దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా గురించి వార్తలు వింటూనే ఉన్నాం.
ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మొన్నటి వరకు ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు.
కానీ ఇటీవలే డిసెంబర్ 9వ తారీఖున ఈ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్నట్లు అధికారికం గా ప్రకటించారు.అంతే కాకుండా సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం తో ఆసక్తి పెరిగింది.
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా అంటే ఒక రేంజ్ లో ప్రేక్షకులు ఆసక్తి గా ఉండే అవకాశం ఉంది.కానీ సినిమా గురించి పెద్దగా ప్రచారం చేయక పోవడం తో పబ్లిసిటీ కార్యక్రమాలు లేక పోవడంతో ఈ సినిమా ను జనాలు ఎంత వరకు చూస్తారు అనేది అనుమానంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

తమన్నా మరియు సత్యదేవ్ కాంబినేషన్ ఏంటి అంటూ మొదట చాలా మంది పెదవి విరిచారు.టీజర్ విడుదల తర్వాత చాలా మంది ఈ సినిమా లో మ్యాటర్ ఉంటుంది అని నమ్మారు.ట్రైలర్ విడుదల తర్వాత తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.కానీ తాజాగా సినిమా కు పబ్లిసిటీ కార్యక్రమాలు చేయక పోవడం తో ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తి ఆసక్తి తగ్గుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నాలుగు ఐదు రోజులు సమయం మాత్రమే రిలీజ్ కు సమయం ఉంది.ఈ నాలుగు ఐదు రోజుల సమయం లో చిత్ర యూనిట్ సభ్యులు ఏం చేస్తారో అనేది చూడాలి.
ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలను మాత్రం ప్లాన్ చేయలేదు.కానీ తమన్నా ఫ్యాన్స్ మాత్రం సినిమా ను చూడాలని ఆసక్తిగా ఉన్నాం అంటూ ఎదురు చూస్తున్నారు.