Tabu Drishyam 2 : అప్పుడు కష్టపడినా... ఇప్పుడు సంతోషంగా ఉంది నటి కామెంట్స్ వైరల్!

ఉత్తరాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నటువంటి టబు తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Even Though It Was Hard Then Now She Is Happy The Actresss Comments Are Viral Ta-TeluguStop.com

ఇకపోతే ఈ ఏడాది ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడంతో ఎంతో సంతోషంలో ఉన్నారు.

కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల అనంతరం టబూ నటించిన భూల్‌ భులయ్యా 2‘తో హిట్‌ కొట్టిన ఈ నాయిక ఇటీవలే విడుదలైన దృశ్యం 2 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ విజయం వెనుక ఎంతో కష్టం ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన సినిమాల గురించి సినిమాల కోసం ఆమె పడిన కష్టం గురించి చెప్పుకొచ్చారు.గత ఏడాదిన్నర కాలంలోనే ఈమె ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్ అయ్యానని చెప్పుకొచ్చారు.

Telugu Ajay Devgn, Bhool Bhulaiyaa, Bollywood, Drishyam, Kartik Aryan, Tabu-Movi

ఈ విధంగా ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్ కావడంతో ఎంతో కష్టతరంగా సినిమా షూటింగులలో పాల్గొని సినిమా షూటింగ్స్ మొత్తం కంప్లీట్ చేశానని తెలియజేశారు.ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలకు పని చేయడం ఒక ఛాలెంజ్, కష్టంగా అనిపించిందని తెలిపారు.కోవిడ్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీఏమాత్రం లెక్కచేయకుండా నా పనిని చేస్తూ సరదాగా ఎంజాయ్ చేశానని తెలిపారు.ఇలా అప్పుడు తాను పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని ఈ సందర్భంగా టబూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube