రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న డబ్బింగ్ సినిమా లవ్ టుడే.ప్రదీప్ రంగనాథన్ డైరక్షన్ లో అతనే హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇవానా అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది.
సినిమాలో ఆమె నటన చూసిన తెలుగు మేకర్స్ అమ్మడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అంతకుముందు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఇవానా లవ్ టుడే తో సోలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాదు లవ్ టుడే ని తెలుగులో రిలీజ్ చేసిన దిల్ రాజు దృష్టిలో పడ్డది ఇవానా.అందుకే అతని ఇంటి వారసుడు ఆశిష్ హీరోగా తెరకెక్కే నెక్స్ట్ సినిమాలో ఇవానాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.
రౌడీ బోయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.ఈ మూవీలో హీరోయిన్ గా ఇవానాని తీసుకున్నారట.దిల్ రాజు ఛాన్స్ ఇస్తున్నాడు అంటే ఆమె రేంజ్ మారినట్టే అని చెప్పొచ్చు.ఇవానా కూడా తెలుగులో వరుస అవకాశాలు అందుకునేలా ఉంది.
అంతేకాదు రెమ్యునరేషన్ కూడా తక్కువే డిమాండ్ చేస్తుందట.సో ఈ టాలెంటెడ్ బ్యూటీకి తెలుగు లో ఛాన్సులు అదరగొట్టేస్తున్నాయి.







