మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కార్తీక్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ రిలీజ్ కాకుండానే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.
ఈసారి జయంత్ పానుగంటి అనే కొత్త దర్శకుడితో సాయి తేజ్ సినిమా చేస్తున్నాడు.ఈ మూవీకి సంబందించిన పూజ కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి.
ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో ఒక అభిమాని కొత్త దర్శకులతో కాకుండా స్టార్ డైరక్టర్స్ తో సినిమా చెయ్ అన్నా అని కామెంట్ పెట్టాడు అయితే దానికి ఆన్సర్ గా సాయి ధరం తేజ్ అతని పేరు జయంత్ గుర్తుపెట్టుకోండి అంటూ డైరక్టర్ మీద తన నమ్మకాన్ని చెప్పాడు మెగా హీరో.
చేస్తున్న ప్రాజెక్ట్.
కలిసి పనిచేస్తున్న డైరక్టర్ మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా.కానీ సాయి ధరం తేజ్ గుర్తుపెట్టుకోండి అతని పేరు జయంత్ అని మరీ చెప్పాడు అంటే అతను కచ్చితంగా మంచి సబ్జెక్ట్ తోనే వస్తున్నాడు అనుకోవచ్చు.కార్తీక్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా కూడా వెరైటీ కథతో వస్తుందని తెలుస్తుంది.మొత్తానికి సాయి ధరం తేజ్ తన సినిమాల ప్లానింగ్ తో అదరగొట్టేస్తున్నాడు.







