భారత్‎కు విశిష్ట ఘనత.. జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరణ

భారత్ కు విశిష్ట ఘనత దక్కింది.ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు గాంచిన జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.

ఇటీవల ఇండోనేషియాలోని బాలీలో జరిగిన జీ 20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే డిసెంబర్ 1 నుంచి అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు.

ఇందులో భాగంగానే ఇవాళ భారత్ ఆ బాధ్యతలను స్వీకరించింది.కాగా ఏడాది పాటు ఈ పదవి కొనసాగనుండగా దేశ వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై రెండు వందల సమావేశాలను నిర్వహించనున్నారు.జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా ప్రత్యేక లోగోను రూపొందించారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు