Telugu song FIFA World Cup : FIFA వరల్డ్ కప్ లో అలరించనున్న “తెలుగు పాట”

తెలుగు బాష గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన బాషలలో మన తెలుగు బాష ఒకటి.

అలాంటి తెలుగు బాషను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తూ, మనదైన తెలుగును ప్రపంచానికి పరిచయం చేస్తూ విదేశీయులు సైతం తెలుగు బాష కు ఆకర్షితులైయ్యేలా గుర్తింపును తీసుకువస్తోంది మాత్రం మన తెలుగు ఎన్నారైలే ఇందులో ఎలాంటి సందేహం లేదు.తెలుగు ఎన్నారైలు ఏ దేశంలో ఉన్నా సరే తెలుగు బాషను తమ పిల్లలకు నేర్పించుతూ, భవిష్యత్తు తరాల వారికి తెలుగుబాష ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నారు.

తాజాగా.అరబ్బు దేశమైన ఖతర్ లో ఫిఫా వరల్డ్ కప్ మొదలైన నేపధ్యంలో తెలుగు బాషకు మరింత గౌరవం గుర్తింపు లభించింది.

ఫిఫా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా గతంలో ఎన్నడూ లేనట్టుగా తెలుగు పాటను విడుదల చేశారు.ఖతర్ లోని ఆంద్ర కళా వేదిక శుభోదయం గ్రూప్ సహకారంతో ఫిఫా వరల్డ్ కప్ లో తెలుగు పాట ను వినిపించేందుకు ఖతర్ ప్రభుత్వ సహకారంతో విజయవంతగా విడుదల చేశారు.

Advertisement

ఈ సందర్భంగా ఆంద్ర కళా వేదిక అధ్యక్షుడు వెంకప్ప మాట్లాడుతూ తమ టీమ్ అతి తక్కువ వ్యవధిలోనే ఈ పాటను రూపొందించిందని తాము తెలుగులో పాటను వినిపించి అరుదైన రికార్డ్ సృష్టించమని తెలిపారు.ఇదిలాఉంటే.

ఖతర్ లో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించే స్టేడియాలు అక్కడి చారిత్రిక కట్టడాలు, అరబ్బు దేశాల ఆచార వ్యవహారాలను పోల్చుతూ రూపొందించిన ఈ తెలుగు పాట ను ఖతర్ ప్రభుత్వం కూడా అభినందించిందని నిర్వాహకులు తెలిపారు.ఈ పాటకు అరబ్బు పదాలను తర్జుమా చేస్తూ తెలుగుకు అనువదించిన తనికెళ్ళ శంకర్ గారికి పాటను ఎంతో అద్భుతంగా పాడిన sp చరణ్ గాయని హరిణి గారికి సంగీతం సమకూర్చిన మాధవపెద్ది సురేష్ గారికి ఖతర్ ఆంద్ర కళా వేదిక అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు