SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రూ.25 వేల లాభం

ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసే సమయంలో వివిధ రకాల బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఉంటాయి.వాటితో చెల్లింపులు జరిపినప్పుడు మనకు క్యాష్‌బ్యాక్‌లు లభిస్తుంటాయి.

 Good News For Sbi Credit Card Holders. If You Do This, You Will Get A Profit Of-TeluguStop.com

ఒక్కోసారి ఆఫర్లు భారీగా ఉంటాయి.అవి తెలియక చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేరు.

వివిధ కంపెనీలు ఆఫర్లలో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు వినియోగించే వారికి చక్కటి క్యాష్‌బ్యాక్‌లు సిద్ధంగా ఉన్నాయి.వివిధ కొనుగోళ్లలో రూ.25 వేల వరకు భారీగా లాభం పొందొచ్చు.దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Telugu Bumper, Credit, Discount, Number, Ups-Latest News - Telugu

వివిద బ్రాండ్ల వస్తువులు కొనుగోలు చేసే క్రమంలో డిసెంబర్ చివరి వరకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు అందుబాటులో ఉన్నాయి.హయ్యర్ (Haier) కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేసే వారికి ఎస్‌బీఐ ద్వారా చెల్లింపులు జరిపితే 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ అంటే రూ.12 వేల వరకు ఆఫర్ లభించనుంది.ఐఎఫ్‌బీ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్ బ్యాక్ (రూ.5 వేలు) పొందొచ్చు.ఎల్‌జీ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేసే వారికి భారీగా లాభం చేకూరనుంది.22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు.అంటే గరిష్టంగా రూ.20 వేల వరకు లాభపడొచ్చు.అన్నిటికంటే ఎక్కువగా శామ్‌సంగ్ ప్రొడక్టులను కొనుగోలు చేసే వారికి గరిష్ట ప్రయోజనాలు చేకూరనున్నాయి.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా శామ్‌సంగ్ ఉత్పత్తులు కొంటే 27.5 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.అంటే గరిష్టంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులు రూ.25 వేల వరకు లాభపడొచ్చు.హీరో బైకులు కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్లు లభించనున్నాయి.

గరిష్టంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.అయితే ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube