Chain Snatcher : షాపు వద్ద వస్తువులు కొంటున్న మహిళకు షాక్.. చైన్ తెంపుకుని పరారైన దొంగ..

ఈ రోజుల్లో చైన్‌ స్నాచింగ్ ఘటనలు చాలా పెరిగిపోతున్నాయి.బంగారం ధరించి రోడ్డు మీదకి వస్తే చాలు దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోతున్నారు.

 The Woman Who Was Buying Things At The Shop Got A Shock The Thief Broke The Chai-TeluguStop.com

కాగా తాజాగా ఒక మహిళ మెడలోని బంగారపు గొలుసును ఒక దొంగ చాలా చాకచక్యంగా ఎత్తుకుపోయాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ గొలుసు దొంగ మామూలు వ్యక్తిగానే జనాల్లో కలిసిపోయి ఒక మహిళకు షాక్ ఇచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే… రాజస్తాన్‌లోని బికనీర్‌లో ఒక షాపు వద్ద ఇటీవల ఒక మహిళ తన స్కూటీపై నిల్చోని వస్తువులు కొనుగోలు చేసింది.

ఆమెకు ఒకట్రెండు అడుగుల దూరంలో మొహానికి ముసుకు చుట్టుకుని ఒక వ్యక్తి నిల్చున్నాడు.ఆమె వస్తువులు కొనడంలో నిమగ్నం కాగా అతడు చుట్టూ చెక్ చేసుకొని ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారపు చైన్ లాక్కొని శరవేగంగా అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆ మహిళకు ఒక సెకన్ పాటు ఏం జరుగుతుందో తెలియలేదు.మెడలో చూసుకుంటే గొలుసు మాయమైంది.వెంటనే అర్థం చేసుకున్న ఆమె తన స్కూటీ అక్కడే ఉంచి తన గొలుసు ఎవరు దొంగలించారో తెలుసుకునేందుకు పరిగెత్తింది.

దొంగోడు గోల్డ్ చైన్ తెంపుకొని పరిగెత్తడానికి సంబంధించిన దృశ్యాలన్నీ షాపు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది.దీనిపై కేసు నమోదు అయిందో లేదో తెలియ రాలేదు కానీ నెటిజన్లు మాత్రం మహిళలు బయటికెళ్లేటప్పుడు బంగారం ధరించకపోవడమే మంచిదని కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube