టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి ఆయన హాజరుకానున్నారని సమాచారం.
డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబును ఆహ్వానించారు.
జీ 20 దేశాల కూటమికి భారత్ అధ్యక్షత వహించనుంది.భారత్ లో నిర్వహించే జీ20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు.