ఆర్ మ్యాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరు అన్న లిస్టును ప్రకటిస్తూ ఉంటుంది.టాప్ హీరోతో పాటు పాన్ ఇండియా లెవెల్లో హీరోల గురించి కూడా లిస్టు తయారు చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటేనే గత నెల అనగా అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్మార్క్స్ స్టార్స్ ఇండియా లవ్స్ మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలో రిలీజ్ చేసింది ఆర్ మాక్స్ సంస్థ.అయితే 10 మంది హీరోలు ఈ జాబితాలో స్థానాన్ని సంపాదించగా ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించని తమిళ హీరో విజయ్ మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
మొదటి స్థానంలో తమిళ హీరో విజయ్ ఉండగా రెండవ స్థానంలో హీరో ప్రభాస్ ఉన్నారు.ఆ తర్వాత మూడవ స్థానంలో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉండగా నాలుగవ స్థానంలో పుష్ప సినిమాతో భారీగా క్రేజ్ ని అందుకున్న అల్లు అర్జున్ ఉన్నారు.
అలాగే ఐదవ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉన్నారు.ఇకపోతే ఆరవ స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ స్థానంలో నిలిచారు.ఇక తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య ఏడవ స్థానంలో నిలవగా ఎనిమిదవ స్థానంలో కన్నడ స్టార్ హీరో యష్ నిలిచారు.ఇకపోతే రామ్ చరణ్ 9వ స్థానంతో సరిపెట్టుకోగా మహేష్ బాబు పదవ స్థానంలో నిలిచారు.
అయితే ఒక పాన్ ఇండియా సినిమాలో కూడా నటించని విజయ దళపతి ఎలా నెంబర్ వన్ హీరో అవుతారు అంటూ ఆర్మార్క్స్ మీడియా సంస్థ చేస్తున్న సర్వేలపై పలువురి విమర్శలు గుప్పిస్తున్నారు.కాగా ఈ విషయంపై స్పందించిన ఆర్మాక్స్ మీడియా సంస్థ సోషల్ మీడియాలో ఎవరి గురించి ఎక్కువ చర్చ జరిగింది అన్న అంశంపై ఈ రిపోర్టు సబ్మిట్ చేస్తున్నట్లుగా వెల్లడించారు.ఇకపోతే మొత్తం పాన్ ఇండియా హీరోల లిస్టుల జాబితాలో ఐదుగురు తెలుగు ఇండియా హీరోలు బాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు అలాగే తమిళ సినీ పరిశ్రమ నుంచి ఇద్దరు హీరోలు కన్నడ సినీ పరిశ్రమ నుంచి కేవలం ఒక హీరో మాత్రమే స్థానాన్ని సంపాదించుకున్నారు.