ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని ప్రత్యేక పండుగలకు సినిమాలను రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ ఉంటుంది.అదే విధంగా మన టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.
ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.మరి ఇప్పటికే ఈ బరిలో నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.
ఇక ఇక్కడే కాదు.ఓవర్సీస్ లో కూడా సంక్రాంతి సందడి స్టార్ట్ అయ్యింది.సినిమాలు రిలీజ్ డేట్లు ఇంకా ప్రకటించకపోయినా అప్పుడే సందడి మాత్రం స్టార్ట్ అయ్యింది.ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాల రైట్స్ కోసం బడా సంస్థలు పోటీ పడుతున్నాయి.
ఎన్ని కోట్లు అయిన పెట్టి సినిమా రైట్స్ ను సొంతం చేసుకోవాలని పోటీ పడుతున్నాయి.
అయితే తాజాగా ఓవర్సీస్ రైట్స్ కు సంబంధించిన అప్డేట్ అందింది.
చిరంజీవి, బాలకృష్ణ, విజయ్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ ను శుక్లా ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది.ఈ మేరకు పోస్టర్ ద్వారా ప్రకటన చేసింది.
బాలయ్య వీరసింహ రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య తో పాటు విజయ్ వారసుడు సినిమా రైట్స్ ను కూడా ఈ సంస్థనే సొంతం చేసుకుంది.
అలాగే సంక్రాంతి సినిమాలనే కాకుండా ఆ తర్వాత రిలీజ్ అవ్వబొయె రామ్ చరణ్ RC15 తో పాటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమాల రైట్స్ ను కూడా కోట్లు పెట్టి మరీ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.మిగతా సంస్థల కంటే ఎక్కువ వెచ్చించి ఈ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది.అమెరికాలో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో చాలా సంస్థలు పోటీ పడుతున్నాయి.
గతంలో శుక్లా సంస్థ బింబిసార, సర్కారు సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుని లాభాలను అందుకుంది.ఇక ఈ సినిమాలతో మరిన్ని లాభాలు అందుకునేందుకు సిద్ధం అయ్యింది.