ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఒక్కో సారి ఫ్లాప్స్ రుచి చూడాల్సిందే.అలంటి గడ్డు కాలం మన మెగాస్టార్ చిరంజీవి కి కూడా తప్పలేదు.
చిరంజీవి నటించిన ఖైదీ సినిమా హిట్టయిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.కానీ 1993 లో వచ్చిన ముఠా మేస్త్రి సినిమా ఫ్లాప్ అయినా తర్వాత వరసగా అనేక సినిమాలు కూడా విఫలం అవ్వడం తో అయన చాల ఇబ్బంది ఫీల్ అయ్యారు.
ఒక్కొక్కటిగా ఎస్ పి పరశురామ్, రిక్షావోడు, మెకానిక్ అల్లుడు, బిగ్ బాస్ గోరంగా విఫలం అయ్యాయి.ఇక ఆ తర్వాత వచ్చిన అల్లుడా మజాకా సినిమా సైతం చిరంజీవిని చాల వివాదాల్లోకి నెట్టింది.
అత్త పాత్రలో సీనియర్ నటి లక్ష్మి నటించగా వీరిద్దరి మధ్య అత్త అల్లుళ్ళ బంధం కాకుండా సరసాలు ఏంటి అంటూ జనాలు మండిపోయారు.అప్పట్లో ఈ సినిమా తర్వాత ఇక ఏ సినిమా చేయాలన్న కూడా చిరంజీవి భయపడే స్టేజ్ కి వచ్చారు.
ఆ టైం లో మమ్ముట్టి తీసిన ఒక సినిమాపై చిరంజీవి కన్ను పడింది.దాన్ని తెలుగు లో రీమేక్ చేయాలనీ అనుకున్నాడు.ఆ స్టోరీ ని అల్లు అరవింద్ ని సంప్రదించగా అతడు కూడా సరే అన్నాడు.ఆ సినిమాను ఎడిటర్ మోహన్ నిరించడానికి ముందుకు వచ్చాడు.
ఇక ఇలాంటి ఒక రీమేక్ సినిమాను డైరెక్ట్ చేయడానికి దర్శకుడు ఎవరు అనుకుంటున్నా టైం లో ఎడిటర్ మోహన్ ముత్యాల సుబ్బయ్య పేరు ప్రపోజ్ చేశారట.

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థలో మామగారు వంటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాను ముత్యాల సుబ్బయ్య తీసి మంచి హిట్టు కొట్టారు. అందుకే చిరంజీవి కూడా ఒకే అనడం తో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఆలా టైటిల్ రోల్ లో చిరంజీవి నటించగా ఈ సినిమా హిట్లర్ పేరు తో వచ్చి మంచి విజయాన్ని సాధించింది.
ఇక మెగాస్టార్ వరస ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేసిన సినిమాగా హిట్లర్ పేరు తెచ్చుకుంటే, నిర్మాత గా ఎడిటర్ మోహన్, డైరెక్టర్ గా ముత్యాల సుబ్బయ్య పేరు సంపాదించుకున్నారు.ఈ సినిమా తర్వాత మళ్లీ మెగా స్టార్ కి పూర్వ వైభవం కూడా వచ్చింది.
ఇక నిర్మాత ఎడిటర్ మోహన్ కొడుకే గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా.







