యూట్యూబ్ ట్రెండింగ్ లో బేబీ టీజర్..!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా బేబీ.మారుతి, ఎస్.కే.ఎన్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజైంది.ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.టీనేజ్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ మూవీ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.రిలీజై 24 గంటలు అవుతున్నా ఇంకా యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంటుంది బేబీ టీజర్.

 Anand Devarakonda Baby Teaser In Youtube Trending ,anand Devarakonda , Baby ,tea-TeluguStop.com

టీజర్ తోనె సినిమాపై అంచనాలు పెంచారు చిత్రయూనిట్.

ఇప్పటికే సాయి రాజేష్ నిర్మాణంలో వచ్చిన కలర్ ఫోటో నేషనల్ అవార్డ్ కూడా అందుకోగా మరోసారి ఈ బేబీతో కూడా అదే రేంజ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.కలర్ ఫోటో తరహాలోనే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా బేబీ తెరకెక్కింది.

సినిమా టీజరే సెన్సేషన్ కాగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.ఈ మూవీ టీజర్ రిలీజ్ కోసం టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ హరీశ్ శంకర్, అనీల్ రావిపుడి, వశిష్ట, మారుతి పాల్గొన్నారు.

సినిమా టీజర్ తోనే యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.రిలీజ్ అయ్యాక మరో అద్భుతమైన ప్రేమ కావ్యంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube