ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతి శ్రద్ధావాకర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.శ్రద్ధాను దారుణంగా హత్య చేసిన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు పోలీసులు ఇవాళ నార్కో ఎనాలసిస్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఢిల్లీలోని రోహిణి ఆస్పత్రిలో నిపుణుల సమక్షంలో ఈ పరీక్ష చేయనున్నారని సమాచారం.హత్యకు సంబంధించి కీలక వివరాలు రాబట్టనున్నారు.
శ్రద్ధ, ఆఫ్తాబ్ ల మధ్య పరిచయం నుంచి హత్య వరకు మొత్తం 40 ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేశారు.ఎందుకు చంపాల్సి వచ్చింది.? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్న విషయంపై సమాచారాన్ని రాబట్టనున్నారు.