సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళులు అర్పించడం తెలిసిందే.అయితే ఇండస్ట్రీ నుండి నాగార్జున రాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
అక్కినేని కుటుంబం నుండి కృష్ణ భౌతిక గాయానికి నాగచైతన్య ఇంకా అక్కినేని అఖిల్ వచ్చి నివాళులు అర్పించారు.అయితే ఈ క్రమంలో నాగార్జున నగరంలోనే ఉన్నా గాని రాలేదని ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయేమో అనే డిస్కషన్ బయట జరుగుతున్నాయి.
ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీలో పేరుగాంచిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు.కృష్ణ భౌతిక కాయం వద్దకు నాగర్జున రాకపోవడానికి గల అనుమానాలకు తెరదించారు.
నాగార్జున గారికి గతంలో ఎంతో దగ్గరగా ఉండే ఈవివి సత్యనారాయణ, దాసరి నారాయణరావు గారు చనిపోయిన సమయంలో కూడా రాలేదు.ఇద్దరితో నాగార్జున గారికి మంచి అనుబంధం ఉంది.
అయితే ఆయన రాకపోవడానికి ప్రధాన కారణం ఆ అనుబంధమే.సాధారణంగా బాగా దగ్గర వారు చనిపోయినప్పుడు కొంతమంది ఆ బాధను తట్టుకోలేరు.
ఈ రకమైన అనుబంధమే కృష్ణ గారితో నాగార్జునకి ఉంది.ఆయనతో ఉన్న సానిహిత్యం.
ఇంకా అభిమానం కారణంగా నిర్జీవంగా చూడలేని పరిస్థితి కారణంతో.నాగార్జున రాలేకపోయారు అని అన్నారు.
అయినా గాని ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు వాళ్లకి అండగా నిలబడటంలో నాగార్జున ఎప్పుడు ముందే ఉంటారు అంటూ సీనియర్ జర్నలిస్టు ప్రభు క్లారిటీ ఇవ్వటం జరిగింది. నాగార్జున మరియు కృష్ణ కలిసి “వారసుడు” మరియు “రాముడొచ్చాడు” సినిమాలు చేయడం జరిగింది.
ఈ రెండు సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.







