ప్రస్తుతం 30 ఏళ్లు దాటగానే యువకులే జిమ్‌లకు దూరం అవుతున్నారు.వ్యాయామం చేసేందుకు బద్ధకిస్తూ, అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు.
అయితే కొంత మంది మాత్రం దీనికి మినహాయింపు.ఇటీవల కాలంలో పురుషులు, మహిళలు జిమ్‌ల వైపు వెళ్తున్నారు.
అధిక బరువు సమస్య నుంచి బయటపడి స్లిమ్‌గా అయ్యేందుకు, చక్కని శరీరాకృతి కోసం జిమ్‌లలో చెమటోడ్చుతున్నారు.అయితే 40 ఏళ్లలోని వారంతా మాత్రమే ఇలా జిమ్‌లలో కష్టపడుతున్నారు.
ఏ మాత్రం 40 ఏళ్లు దాటగానే కుటుంబ బాధ్యతలు, ఆఫీసు పనులతో సతమతం అవుతున్నారు.ఇక మహిళలు 50 ఏళ్లు దాటితో ఆధ్యాత్మికత వైపు మరులుతున్నారు.
వీరందరికీ భిన్నంగా 56 ఏళ్ల వయసు ఉన్న మహిళ జిమ్‌లో కసరత్తులు చేస్తోంది.యువకులతో పోటీ పడేలా జిమ్‌లో బరువులు ఎత్తుతోంది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్ అనే పేజీలో పోస్ట్ చేశారు.అందులో 56 ఏళ్ల మహిళ కథ ఉంది.ఆమె ఇంతకుముందు కాళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉండేవి.
దీంతో ఆమెను వ్యాయామం వైపు అల్లుడు మరల్చాడు.మోకాళ్ల నొప్పులు పోయేందుకు వ్యాయామం గురించి ఆన్‌లైన్‌లో పరిశోదించాడు.
ఫలితంగా ఆమె కొన్నాళ్లుగా జిమ్‌లో వర్కవుట్లు చేస్తోంది.కుమారుడు, అల్లుడి సాయంతో పవర్‌లిఫ్ట్‌లు, స్క్వాట్‌లు మొదలైనవి చేయడం ప్రారంభించింది.
అంతేకాక ఇవన్నీ ఆమె చీరలో చేయడం విశేషం.ఏజ్ ఒక నంబర్ అని ఆమె నిరూపించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె చేస్తున్న కసరత్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు.ఎంతో మందికి ఆమె స్పూర్తిగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు.







