Telangana Slang Movies: తెలంగాణ బాషా అంటే అంత చులకన ? సినిమా పరిశ్రమ ఎప్పుడు మారుతుంది ?

ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు పడ్డాక టాలీవుడ్ సినిమాల్లో హీరోలు కూడా బాగా తెలంగాణ భాషలో డైలాగ్స్ చెప్తూ సినిమాలను హిట్ చేసుకుంటున్నారు.పక్క తెలంగాణ రా భాయ్ అంటూ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు, అయితే చాల ఏళ్ళ నుంచి విలన్స్ కి అలాగే నెగటివ్ క్యారెక్టర్ లకి మాత్రమే తెలంగాణ బాషా పెట్టి సినిమా దర్శకులు తెలంగాణ భాషను చాల అవమానించారు.

 Telangana Language Impact On Tollywood Details, Telangana Language, Telangana Sl-TeluguStop.com

కానీ ఆ రోజులు పోయాయి.ఆ లెక్కలు మారాయి.

ఇప్పుడు తెలంగాణ బాషా లేకుండా సినిమాలు ఉండటం లేదు.ఒకప్పుడు విలన్ గ్యాంగ్ మాత్రమే మాట్లాడే తెలంగాణ భాషను స్టార్ హీరోలు కూడా అలవాటు చేసుకుంటున్నారు.

పక్క తెలంగాణ హీరోలు ఇండస్ట్రీ లో రాణించడం వల్ల కూడా ఇలా కొంత తెలంగాణ భాషకు గౌరవం దక్కుతుంది.కానీ ఇప్పటికి తెలంగాణ అంటే తిట్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తన్నయ్.

బాడ్కవ్, బద్మాష్, సాలె, కమీనే, కుత్తే, హౌలే, దేడ్ దిమాఖ్ ఇవి తెలంగాణాలో బాగా వినిపించే తిట్లు.అయితే సినిమాల్లో కూడా వీటిని ప్రమోట్ చేసి తెలంగాణ బాషా కి అన్యాయం చేస్తున్నారు మేకర్స్.

ఈ తీరు మారకపోతే భవిష్యత్తు తరాల సినిమాలు కూడా ఇలా చీప్ లాంగ్వేజ్ తో సినిమాలు తీసి ఇదే తెలంగాణ బాషా అని ఆనేలాగా ఉన్నారు.మరి తెలంగాణ సంస్కృతి అంటే కేవలం తిట్లు, భూతులు మాత్రమేనా ?

Telugu Andhra Language, Telangana Slang, Tollywood-Movie

తెలంగాణ బాషా అంటే ఓన్ చేసుకోవడం.పరిచయం లేకపోయినా సొంత వాళ్ళు అనే ఫీలింగ్ తీసుకరావడం.ఇలాగే భూతులతో అందరిని పిలుస్తారు అని నమ్మించడం కాదు.

ఒక్క తెలంగాణ వారే భూతులు మాట్లాడుతారా ? ఆంధ్ర లో ఎవరు మాట్లాడారా ? మీకు కావాల్సినట్టుగా మీ భాషను బాగా ప్రమోట్ చేసుకొని తెలంగాణ అంటే భూతు బాషా అనే పేరు వచ్చేలా సినిమాలు తీసి యువతపై రుద్దడం ఎంత వరకు కరెక్ట్.ఈ పద్దతికి ఎప్పుడు చరమగీతం పాడుతారు.

దయచేసి మీ డర్టీ మైండ్ తో డర్టీ ఊహాశక్తి తో సినిమాలు తీసి మా భాషను కించపరిచే ప్రోగ్రామ్స్ బంద్ చేస్తే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube