Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్లు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు అంతా గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడతారు.గూగుల్ మ్యాప్ ఆధారంగా తమ గమ్యాలను చేరుకుంటుంటారు.

 New Features In Google Maps Netizens Are Surprised , Google Maps, Technology Ne-TeluguStop.com

ఇక యూజర్లను ఆకట్టుకునేందుకు గూగుల్ కూడా మ్యాప్స్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.ఈ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఈవెంట్ ఆన్ ఈవెంట్‌లో లైవ్ వ్యూ ఫీచర్‌ను ప్రదర్శించింది.

మ్యాప్‌లలోని తాజా అప్‌డేట్‌లు స్మార్ట్‌ఫోన్ కెమెరాతో పరిసరాలను శోధించే సామర్థ్యంతో వస్తాయి.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Google Maps, Latest, Ups-Latest News - Telugu

“సెర్చ్ విత్ లైవ్ వ్యూ” పేరుతో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.యూజర్లు సమీపంలో లేని ప్రాంతాలను కనుగొనటానికి ఉపయోగపడుతుంది.యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించి మనకి కావాల్సిన ప్రాంతం ఏ దిశలో ఉందో, ఎంత దూరంలో ఉందో కూడా స్పష్టంగా తెలియజేస్తుంది.అంతేకాకుండా ఏదైనా రెస్టారెంట్లు ఉంటే అది బిజీగా ఉందా, అక్కడి ఆహార పదార్ధాలకు యూజర్ల రేటింట్, టైమ్‌టేబుల్స్ వంటి ముఖ్య సమాచారాన్ని ఇస్తుంది.

రెండో అప్‌డేట్ విషయానికొస్తే ప్రస్తుతం అంతా ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు.అయితే ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.ఆ సమస్యకు పరిష్కారంగా Find charging station for an EV పేరుతో ఫీచర్ తీసుకొచ్చింది.దీని ద్వారా యూజర్లు తమ ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ఛార్జ్ చేయగల ఛార్జింగ్ స్టేషన్‌లను కనుగొనవచ్చు.

అనారోగ్యం వల్లనో, వృద్ధాప్యం వల్లనో కొంత మంది వీల్ చైర్‌కి పరిమితం అవుతుంటారు.అలాంటి వారి కోసం ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

దీనికి సంబంధించిన సెట్టింగ్‌ని ఆన్ చేయడం ద్వారా యూజర్లు ఈ ఫీచర్ వినియోగించుకోగలరు.అంతేకాకుండా, స్పాట్‌లో యాక్సెస్ చేయగల రెస్ట్‌రూమ్‌లు, పార్కింగ్, సీటింగ్ ఆప్షన్‌లు ఉన్నాయా అని కూడా యూజర్లు తెలుసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube