సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అడవి శేష్ వరుసగా చిన్న సినిమా లు చేస్తూ సక్సెస్ ఫుల్ నటుడి గా, విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్నాడు.కేవలం హీరో అనిపించుకోవాలని కాకుండా నటుడి గా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం తో మంచి కథలను ఎంపిక చేసుకుంటూ తానే కథలను రాసుకుంటూ కెరియర్ లో అడవి శేష్ ముందుకు వెళుతున్నాడు.
ఇటీవల ఈయన మేజర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ దక్కించుకున్న విషయం తెలిసిందే.ఈ యంగ్ హీరో వరుసగా సినిమా లు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
ఈ వారం హిట్ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
నాని నిర్మాణం లో రూపొందిన ఈ సినిమా కు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.
హిట్ 1 లో విశ్వక్ సేన్ హీరో గా నటించిన విషయం తెలిసిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపద్యంలో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఒక కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యం లో సాగే కథ తో ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

సినిమా యొక్క విజువల్స్ మరియు కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంటాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.యంగ్ హీరో చాలా సైలెంట్ గా ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరి సినిమా తో ఆయన సక్సెస్ దక్కించుకుని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ద్వారా మరిన్ని సినిమాలు చేస్తాడా అనేది చూడాలి.
ఈ సినిమా తో నాని నిర్మాత గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.ఈ సినిమా హిట్ అయితే హిట్ ప్రాంచైజీ నుండి మరో సీక్వెల్ వచ్చే అవకాశం ఉందట.







