Chandrababu Naidu : పొత్తులు లేకపోతేనే బెటరా బాబు గారు ? 

2019 ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళింది.కేవలం 23 స్థానాలని దక్కించుకుంది.

 Better Babu Garu Without Alliances ,tdp, Bjp,janasena, Ap Government,ysrcp, Cbn,-TeluguStop.com

ఎన్నికలకు ముందు జనసేన బీజేపీలు పొత్తు కోసం ఎంతగానో ప్రయత్నం చేసినా, వర్కవుట్   కాకపోవడంతో , ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పై ఒంటరిగా పోటీ చేసి గెలవాలని చూసినా, ఫలితం తీవ్ర నిరాశపరిచింది.ఎప్పుడూ లేనివిధంగా టిడిపి ఘోర పరాజయం చెందింది.

కేవలం 23 స్థానాలుతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది.అయితే ఇదంతా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడమే కారణమని చంద్రబాబు విశ్లేషించుకున్నారు.

తాను టిడిపి అధ్యక్ష బాధ్యతను స్వీకరించిన తర్వాత ఎప్పుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళిన అనుభవం లేదు.ఎప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు కానీ , ఒంటరిగా వెళ్తే జరిగిన నష్టం ఏమిటో 2019 ఎన్నికల్లో రుజువయింది.

మళ్లీ అటువంటి తప్పు చేయకూడదనే ఉద్దేశంతో టిడిపి జనసేన పొత్తు కోసం బాబు ఎప్పటి వరకు ప్రయత్నిస్తూనే వచ్చారు.

అయితే జనసేన ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నా.

బిజెపి మాత్రం జనసేన టిడిపిలో పొత్తు కు అడ్డంకిగా మారింది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత టిడిపి తో జనసేన కలిసి రాదనే విషయం బాబుకు ఒక క్లారిటీ వచ్చింది.

ఎలాగూ బిజెపి తమతో పొత్తుకు అంగీకరించదనే విషయం అర్థం కావడంతో , ఇప్పుడు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు బాబు వచ్చారు.ఈ నేపథ్యంలోని ప్రజల్లో సెంటిమెంటును మరింత రగిల్చెందుకు ఇవే తనకు చివరి ఎన్నికలనే సెంటిమెంటును జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.

జనసేన తమతో కలిసి వచ్చినా, రాకపోయినా నష్టం ఏమీ లేదని చంద్రబాబు తాజాగా నిర్ణయానికి వచ్చారట.దీనికి బాబు లెక్కలు కూడా వేసుకుంటున్నారు.

పై మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలలో టిడిపి పై ఒక ప్రత్యేక అభిమానం ఉందని, విజన్ ఉన్న నేతగా తనను భావిస్తూ ఉంటారని, తాను ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం జనాల్లో ఉందని, తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ జగన్ చేసిన విన్నపం 2019 ఎన్నికల్లో పనిచేసినా,  ఆయన పాలనలో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు తనకి చివరి ఛాన్స్ అనే సెంటిమెంటును రగల్చడం ద్వారా టిడిపికి మళ్లీ అధికారం కట్టబెడతారని బాబు బలంగా నమ్ముతున్నారు.
 

Telugu Ap, Chandrababu, Janasena, Ysrcp-Political

ఇక జనసేనతో కలిసి వెళ్లడం కంటే, విడిగా పోటీ చేయడం వల్లే టీడీపీకి ఎక్కువ ఆదరణ ఉంటుందనే లెక్కలు బాబు ఇప్పుడు వేసుకుంటున్నారట.జనసేన టిడిపి కలిసి పోటీ చేసినా, కాపు సామాజిక వర్గం వారు టిడిపి పోటీ చేసే స్థానాల్లో మద్దతు పూర్తిస్థాయిలో ఇవ్వరని,  పైగా జనసేన కలవడం వల్ల బీసీ సామాజిక వర్గం తమకు దూరమవుతుందని బాబు అంచనా వేస్తున్నారట.అదీ కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే టిడిపి గెలవదు అన్న అభిప్రాయం తప్పు అనే విషయాన్ని నిరూపించేందుకు ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే మేలు అన్న లెక్కల్లో బాబు ఉన్నారట.

టిడిపి ,జనసేన, బిజెపిలో విడివిడిగా పోటీ చేస్తే అధికార పార్టీగా ఉన్న వైసిపి వ్యతిరేక ఓటు చీలి, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు భావించినా, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ప్రజల్లో మరింత చైతన్యం వచ్చిందని, తప్పకుండా టిడిపి అధికారంలోకి వస్తుందని అందుకే ఒంటరిగా పోటీ చేస్తేనే అన్ని విధాలుగా మంచిదనే అభిప్రాయానికి బాబు వచ్చారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube