Kamal Haasan Parliamentary Elections : ఎన్నికలకు సిద్ధంగా ఉండండి కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు..!!

“మక్కల్ నీది మయ్యమ్” పార్టీ అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అందరూ రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు.

 Get Ready For The Election Kamal Haasan Sensational Comments , Kamal Haasan, Par-TeluguStop.com

చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ లో జరిగిన పార్టీ సమావేశంలో.జిల్లా నేతలు మరియు రాష్ట్ర నిర్వాహకులకు దిశా నిర్దేశం చేశారు.

జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలా లేకపోతే పొత్తులతో ముందుకు వెళ్లాలా అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో పొత్తులకు సంబంధించి.

నేతల వద్ద నుండి సూచనలు తీసుకోవడం జరిగింది.అయితే ఈలోగా బూత్ కమిటీల వారీగా పార్టీని బలోపేతం చేయాలని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు నాయకులను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు.ఇక గత ఎన్నికలలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో డీఎంకే పార్టీతో… కమల్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తమిళ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube