కూతురిపై కన్న తల్లిదండ్రులే కర్కశంగా వ్యవహరించారు.ఈ అమానవీయ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కక్ష కట్టారు.ఈ నేపథ్యంలోనే కూతురికి శిరోముండనం చేశారు.
ప్రేమ వివాహం చేసుకున్న ఏడు నెలల తర్వాత కూతుర్ని కిడ్నాప్ చేసి శిరోముండనం చేశారు పేరెంట్స్.దీంతో బాధిత యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.







