Katrina Kaif Vicky Kaushal : పెళ్లికి ముందు నుంచే భర్తను కంట్రోల్ లో పెట్టుకున్న కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?

చాలామంది పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తాము పెళ్లి చేసుకునే అబ్బాయిలు అలా ఉండాలి.ఇలా ఉండాలని అనుకుంటారు.

 Katrina Kaif Kept Her Husband Under Control Even Before Marriage , Katrina Kaif-TeluguStop.com

ఇక కొందరు మాత్రం పెళ్లికి ముందే తమ కాబోయే భర్తలకు కండిషన్స్ కూడా పెడుతుంటారు.అలా చాలామంది అమ్మాయిలు కండిషన్స్ పెట్టగా.

సిని ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా తమ కాబోయే వాళ్ల కోసం కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు.అలా గతంలో ఒక స్టార్ హీరోయిన్ కూడా తన భర్తకు పెళ్ళికి ముందు కొన్ని కండిషన్స్ పెట్టిందట.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.

మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి అందరికీ తెలిసిందే.

తన నటన తో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.తను మోడలింగ్ లో కూడా మంచి గుర్తింపు పొందింది.

ఇక్కడి నుండే సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ గ్లామర్ బ్యూటీ ఇప్పుడు ఓ రేంజ్ కు ఎదిగింది.అంతేకాకుండా బాలీవుడ్ నటుల్లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న నటుల్లో కత్రీనా కైఫ్ కూడా ఉంది.

ఈమె తొలిసారిగా 2004లో విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్ లో అడుగుపెట్టిన కత్రినాకు అంతగా గుర్తింపు రాలేక పోయేసరికి.

మల్లీశ్వరి తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి మంచి హిట్ ను సాధించుకుంది.మొదట్లో తన నటన పట్ల విమర్శలు ఎదురైనా.అవన్నీ పట్టించుకోకుండా రాను రాను తనదైన శైలిలో మంచి గుర్తింపు సాధించుకుంది.

ఇక ఈమె మరో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో ప్రేమలో పడి తన ప్రేమను పెళ్లి తోనే ముడి వేసుకుంది.

ఇక గతంలో ఈ జంట ఫ్రెండ్షిప్ అని చెప్పుకొని బాగా తిరిగారు.కానీ వీరి మధ్య బంధం చూసి అందరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు.

కానీ ఈ జంట మీడియా ముందు కూడా ఈ విషయం గురించి వీరికి పలు ప్రశ్నలు ఎదురవడంతో తమ మధ్య కేవలం ఫ్రెండ్షిప్ ఉందని చాలాసార్లు చెప్పుకున్నారు.అలా వారి ప్రేమను చాలా రహస్యంగా కాపాడుకున్నారు.

మొత్తానికి ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఈ బాలీవుడ్ జంట.

Telugu Katrina Kaif, Mallishwari, Vicky Kaushal-Movie

తమ పెద్దల సమక్షంలో మొత్తానికి ఒకటయ్యారు.గత ఏడాది డిసెంబర్ 9న రాజస్థాన్ లో సవాయ్ మాధోపూర్ లో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు.పెళ్లి తర్వాత వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

పైగా కత్రినా కైఫ్ తన సోషల్ మీడియాలో ఖాతాలలో కూడా తన ప్రొఫైల్ పిక్ ను కూడా మార్చుకుంది.కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ముంబై లో సెటిల్ అయ్యారు.

అయితే వీళ్ళ పెళ్లి జరిగి ఏడాది కావస్తుండగా.వీరి గురించి ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

కత్రినా పెళ్లికి ముందే తన భర్తకు కొన్ని కండిషన్స్ పెట్టిందట.ఇంతకు ఆ కండిషన్స్ ఏంటంటే.

పెళ్లి తర్వాత నీ డబ్బు నీది అంటూ.నా డబ్బు నాది అంటూ కండిషన్స్ పెట్టిందట.

Telugu Katrina Kaif, Mallishwari, Vicky Kaushal-Movie

నీకు ఎంత డబ్బు వస్తుంది.ఎందుకు డబ్బులు వాడుతున్నావు అని అడగను అంటూ.అంతేకాకుండా నువ్వు కూడా నా డబ్బు గురించి నా ఆస్తుల గురించి టాపిక్ తీయొద్దు అని అన్నదట.ఏవైనా ఆస్తులు కొన్నాలన్న సమాన షేర్ లో కొని సమానంగా పంచుకోవాలని కండిషన్ పెట్టిందట.

ఇక నేను ఖర్చు చేసినందుకు నువ్వు ఏ మాత్రం అడగకూడదు అని.నా మీద పెత్తనం చెలాయించకూడదు అని.నా డబ్బులు ఏమైనా చేసుకుంటాను అని గట్టిగానే అన్నదట.

అంతేకాకుండా తన టూర్లకు అడ్డు చెప్పద్దు అని.నా డబ్బుతో నేను మేకప్ కిట్స్ కొనుక్కుంటాను.ఏమైనా చేసుకుంటాను.

నువ్వు మాత్రం అవేవీ అడగొద్దని.ఇక నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ తో తిరిగిన, ఖర్చుపెట్టిన నేను అడగను అని.ముఖ్యంగా కుటుంబానికి పెట్టాలి అనుకున్న సమయంలో ఇద్దరం షేర్ చేసుకొని పెట్టాలి అని కండిషన్స్ పెట్టిందట.ప్రస్తుతం ఈ కండిషన్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube