Superstar Krishna Vijaya Nirmala: కృష్ణ రెండవ పెళ్లి గురించి మహేష్‌ బాబు స్పందన ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ మృతి ఆయన కుటుంబానికే కాకుండా యావత్ తెలుగు ప్రజానీకానికి కూడా దుఃఖాన్ని మింగిల్చింది.తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఆయన కు ఘన నివాళులు అర్పిస్తోంది.

 Mahesh Babu Reaction For Krishna Second Marriage , Mahesh Babu , Krishna, Indira-TeluguStop.com

తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన విజయాలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా సరికొత్త టెక్నాలజీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కింది అనడంలో సందేహం లేదు.అలాంటి సూపర్‌ స్టార్ కృష్ణ వ్యక్తిగత జీవితం లో రెండు పెళ్లిళ్ల కారణంగా వివాదాస్పదం అయ్యారు.

మొదటి భార్య ఇందిరా దేవి బతికి ఉండగానే విజయ నిర్మల ను వివాహం చేసుకోవడం తో చాలా మంది ఆయన్ను తప్పు పట్టారట.అయితే ఈ విషయమై మహేష్ బాబు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది చాలా మందికి సస్పెన్స్ గా ఉంటుంది.

విజయ నిర్మల ను కృష్ణ వివాహం చేసుకున్న సమయం కు మహేష్ బాబు వయసు చాలా చిన్న, ఆ సమయంలో ఏమీ అనలేని పరిస్థితి.అయితే పెద్దవాడైన తర్వాత కూడా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ ను రెండవ పెళ్లి గురించి కనీసం ప్రశ్నించలేదట.

Telugu Indira Devi, Krishna, Mahesh Babu, Vijaya Nirmala-Movie

తన తండ్రి నిర్ణయాన్ని గౌరవిస్తూ.ఒక గొప్ప కొడుకుగా ఆదర్శవంతమైన కొడుకుగా మహేష్ బాబు నిలిచాడని అంటారు.తన తల్లి తో మహేష్ బాబు చాలా చక్కని అనుబంధాన్ని కలిగి ఉండేవాడు.అదే అనుబంధాన్ని తండ్రి కృష్ణ తో కూడా మెయింటైన్ చేశారు అంటూ ఇండస్ట్రీ వారు మాట్లాడుకుంటారు.

మహేష్ బాబు ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి.ఆ తర్వాత సూపర్ స్టార్ అవ్వడానికి కచ్చితంగా ప్రధాన కారణం కృష్ణ అనడం లో సందేహం లేదు.

కృష్ణ రెండవ పెళ్లి చేసుకున్నా కూడా తన మొదటి భార్య ను మరియు మొదటి భార్య యొక్క సంతానం ను వదిలి పెట్టలేదు.సమానమైన ప్రాముఖ్యత ఇవ్వడం తో ఎప్పుడూ కూడా విభేదాలు గొడవలు అనేది రాలేదు.

విజయ నిర్మలతో మహేష్ బాబు తో పాటు ఇందిరా దేవి కూడా సన్నిహితంగా మెలిగే వారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube