David warner rashmika spoof: రష్మిక ఐయాం సారీ అంటూ పోస్ట్ షేర్ చేసిన డేవిడ్ వార్నర్.. ఏమైందంటే?

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

 Cricketer David Warner Spoof Video On Rashmika Mandanna Song Details, David Warn-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో డేవిడ్ వార్నర్ ఫేస్ యాప్ ద్వారా తన ఫేస్ మార్నింగ్ చేసుకొని సెలబ్రిటీల పాటలకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చేవారు.ఇప్పటివరకు ఈయన అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పాటలకు డైలాగులకు ఎన్నో వీడియోలు చేసి ప్రేక్షకులను సందడి చేశారు.

ఇదివరకు కేవలం హీరోలను మాత్రమే అనుసరించిన డేవిడ్ వార్నర్ మొదటిసారిగా హీరోయిన్లను కూడా వదలడం లేదని చెప్పాలి.ఈ క్రమంలోనే ఫేస్ యాప్ ద్వారా హీరోయిన్ రష్మిక చేసిన డాన్స్ కి తన ఫేస్ మార్ఫింగ్ చేసి ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.నితిన్ రష్మిక జంటగా నటించిన భీష్మ సినిమాలో పాటలకు డేవిడ్ వార్నర్ ఫేస్ మార్ఫింగ్ చేసి రష్మిక మొహానికి బదులు తన ఫేస్ జోడించి ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది.ఇకపోతే ఈ వీడియోని డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఐ యాం సో సారీ రష్మిక అంటూ ఈ వీడియోని పోస్ట్ చేశారు.ఇక ఈ వీడియో పై ఎంతో మంది స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే ఈ వీడియో పై ఇప్పటివరకు రష్మిక ఏ విధంగా స్పందించకపోవడం గమనార్హం.

మరి ఈ వీడియో పై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube