బాలలు జాతీయ సంపద జాతీయ ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించే భవిష్యత్తుమానవ వనరులు.వారి శ్రేయస్సు దేశాభివృద్ధికి మూలం అందుకే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు .
బాలల సంక్షేమం అభివృద్ధి పైపెట్టుబడి దేశాభివృద్ధికి సూచిక.బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతి బిడ్డ జన్మ హక్కు .సమాజంలో మంచి పౌరులుగా ఎధుగాలంటె బాల్యదశ కీలకమైంది.భవిష్యత్తు జీవిత లక్ష్యాల నిర్ణయానికి బాల్యమే పునాది .బాలల మనసులు చాలా సున్నితమైనవి బాల్యదశలో వారు ఎదురుకున్న ఇబ్బందులు అనుభవించిన కష్టాలువారి భవిష్యత్తు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మానసిక శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో పేర్కోన్నారు .ఇంటిలో బడిలో అహల్లాధకరమైన వాతావరణంలో బాలలు పెరగడానికి కావలసిన పరిస్థితులు కలిపించి వనరులు సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద సమాజం మీద వుంటుంది.
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ,ప్రపంచ ఆర్థిక ‘వ్యవస్థ విద్యా వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైంది.మూతబడిన స్కూల్స్ ఊడిన ఉద్యోగాలు‘ స్తంభించిన ప్రజాజీవనం’ మూతబడిన పరిశ్రమలు ‘పెరిగిన నిరుద్యోగం’ తగ్గిన ఆదాయం బాలల జీవితాలను ప్రభావితం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బాలలు మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన బాలలు కనీస సౌకర్యాలు లేక ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేనికటిన దారిద్య్రం లోకి నెట్టివేయ బడ్డారనీ ఇటీవల “యూనిసెఫ్” నివేదిక పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి 1989 లో.బాలల హక్కుల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన చట్టాలను సభ్య దేశాల ప్రభుత్వాలు అమలు చెయ్యాలి.యునెస్కో బాలల హక్కుల రక్షణ కోసం 54 హక్కులను సూచించింది.
ఇందులో 1నుండి ,42 వరకు బాలురకు 43 నుండి54 వరకు బాలికల హక్కుల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన చట్టాలను అమలు చేసి బాల బాలికల కు బాల్యదశ లోహక్కులను రక్షణకు రక్షణ కవచంగా నిలిచాయి.యునెస్కో సూచించిన చట్టాలు బాలల బంగారు జీవితానికి భాట.కావాలి 6 నుండి 14 యేళ్ల బాలలు హోటళ్లలో ఇటుకబట్టిలలో ప్రమాదకరమైన పనుల్లో పనిచేయడం నిషేధించబడింది 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి బాలలు అత్యవసర సమయములో తమ హక్కులను రక్షించుకోవచ్చు.పేదవర్గాల బాలకు ఉచితంగా డిజిటల్ టెక్నాలజీ పరికరాలు అందించాలి .బాలల హక్కుల సంరక్షణ చట్టాలు సమర్ధ వంతంగాఅమలు చెయ్యాలి.“బాలల అభివృద్ధే దేశాభివృద్ధి” లక్ష్యంగా ప్రభుత్వాలు సమగ్రమైన అభివృధి వ్యూహలతో బాలలకు బంగారు భవితను కలిపించాలి
.






