Modi G20 Summit Indonesia: ఇండోనేషియా G20 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ..!!

నవంబర్ 15, 16 తేదిలలో ఇండోనేషియాలో జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి సోమవారం  ప్రధాని మోడీ పయనం అయ్యారు.రెండు రోజులపాటు ఇండోనేషియా రాజధాని బాలిలో మోడీ పర్యటించనున్నారు.

 Pm Modi To Participate In G20 Summit In Indonesia-TeluguStop.com

దాదాపు 20 సమావేశాలలో పాల్గొననున్నారు.అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని సునాక్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సహా మరో 10 దేశాల అధ్యక్షులు హాజరుకానున్నట్లు సమాచారం.

ఇక ఇదే పర్యటనలో ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రధానంగా ఈ సదస్సులో ఆహారం మరియు ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆరోగ్య అంశాలపై జరిగే మూడు కీలక చర్చల్లో ప్రధాని పాల్గొంటారని విదేశీ కార్యదర్శి వినయ్ క్వాత్రా .ఆదివారం తెలియజేయడం జరిగింది. అంతేకాదు ఈ పర్యటనలో కొంతమంది దేశ అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో ప్రధాని మోడీతో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెంట వెళ్లడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube