దుల్కర్ సల్మాన్ హీరో గా రూపొందిన సీతారామం సినిమా లో హీరోయిన్ గా నటించిన మృనాల్ ఠాకూర్ వరుసగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కు అధికారికం గా ఈమె ఓకే చెప్పనప్పటికీ ఆమె వద్దకు వెళ్లిన ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.
తెలుగు తో పాటు హిందీ మరియు తమిళం లో కూడా ఈమె సినిమా లు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ సమయం లోనే సోషల్ మీడియా లో ఈ అమ్మడు షేర్ చేస్తున్న అందాల ఫొటోస్ అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి.
ముద్దుగుమ్మ అందాల ఫోటో లకు ప్రతి ఒక్కరు ఫీదా అవుతున్నారు.
తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్ర కారు మతులు పోగొడుతున్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
పింక్ చీర కట్టు లో ఈ అమ్మడి అందాల ఆరబోత కళ్ళు తిప్పుకోనంత అందంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సీతారామం లో సీత గా ఎంత అందం గా కనిపించిందో ఇప్పుడు ఈ ఫొటోస్ లో అంతే అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తూ చీర కట్టు లో కూడా ఇంత అందం గా కనిపిస్తే ఏ ఒక్కరు మాత్రం నిన్ను అభిమానించకుండా ఉంటారు చెప్పు మేడం అంటూ చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఈమె కు అభిమానులుగా మారి పోతున్నారు.

త్వరలోనే ఈ అమ్మడు తెలుగు స్టార్ హీరో లకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి వరుసగా సినిమా లు చేయాలి అంటూ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.మరి అది ఎప్పటికీ సాధ్యమవుతుందో చూడాలి.తెలుగు లో ఎన్టీఆర్ కి జోడీగా ఈమె ఒక సినిమా లో కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
అది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.







