తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి నిన్న బాలాదిత్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.సాధారణంగా ఆదివారం ఎపిసోడ్ లో మాత్రమే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం.
చాలా అరుదుగా మాత్రమే శనివారం ఎపిసోడ్ లోనే కొందరు ఎలిమినేట్ అవుతున్నారు.ఆర్ జె సూర్య కూడా శనివారం ఎపిసోడ్లోనే ఎలిమినేట్ అయ్యాడు.
తాజాగా బాలాదిత్య కూడా శనివారం ఎపిసోడ్ లోనే ఎలిమినేట్ అవ్వడం తో అంతా షాక్ అయ్యారు.ఇక బాలాదిత్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బాలాదిత్య వల్లే గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.ఆ విషయం పై బాలాదిత్య స్పందిస్తూ.తన సిగరెట్స్ వల్లే గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది అంటే తాను అస్సలు ఒప్పుకోను అంటూ బాలదిత్య చెప్పుకొచ్చాడు.ఆమె ప్రవర్తన కారణంగానే ఎలిమినేట్ అయింది తప్పితే తన వల్ల కానే కాదు అంటూ బాలాదిత్య చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
బాలాదిత్య కన్నీళ్లు పెట్టుకొని సిగరెట్ కోసం ఒకానొక సందర్భం లో గీతూ రాయల్ పై నోరు పారేసుకున్నాడు.అందుకే ఆమె ఎలిమినేట్ అయిందని చాలా మంది బలం గా వాదిస్తున్నారు.

కానీ ఆయన ఒప్పుకోవడం లేదు.గీతూ రాయల్ కూడా తాను సిగరెట్ వల్ల ఎలిమినేట్ అయ్యాను అని భావించడం లేదని.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.మొత్తానికి వీరిద్దరి ఎలిమినేషన్ బ్యాక్ టు బ్యాక్ ఉండడం.అది కూడా సిగరెట్ వాళ్లే అవ్వడం ఆశ్చర్యం గా ఉందంటూ బిగ్బాస్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.నేటి ఎపిసోడ్ లో కూడా ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.







