Lavanya Tripathi: వామ్మో లావణ్య త్రిపాఠి తన జీవితంలో ఇన్ని వివాదాల్లో ఇరుక్కుంది ?

ఎక్కడో యూపీలో డెహ్రాడూన్ లో పుట్టి ముంబైలో తన చదువులను పూర్తిచేసుకుని తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది లావణ్య త్రిపాఠి.చిన్ననాటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంది.

 Lavanya Tripati And Her Controversies Details, Lavanya Tripathi, Heroine Lavanya-TeluguStop.com

అయితే తన తండ్రి చదువులు ముందు పూర్తి చేయాలని పట్టుబట్టడంతో తండ్రి కోసం డిగ్రీ పూర్తి చేసింది.ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది.

అలా స్కూల్లో చదువుతున్న సమయంలోనే మిస్ ఉత్తరాఖండ్ గా ఎంపిక అయ్యింది లావణ్య.ఇక హిందీ చిత్ర పరిశ్రమ లావణ్య కి వెల్కమ్ చెప్పలేదు.

దాంతో టెలివిజన్లో ఆమె లక్కును పరీక్షించుకుంది.అలా మొదటిసారిగా హిందీలో సీరియల్ లో నటించే అవకాశం లభించింది.

ఆ తర్వాత తెలుగులో అందాల రాక్షసి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది.ఈ సినిమా విజయవంతం కావడంతో ఆమెకు సౌత్ లో అవకాశాలు వెలువెత్తాయి.

దాంతో ఆమె సౌత్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది.ఇక బాలీవుడ్ ని వదిలేసి సౌత్ కే ఫిక్స్ అయింది.

ఇక బాలీవుడ్ ఆల్ టైం ఫేవరెట్ సీరియల్ అయినా సీఐడీలో సైతం సాక్షి అనే పాత్రలో లావణ్య నటించింది.సినిమాల్లో సంచలనాలు సృష్టించకపోయిన వ్యక్తిగత జీవితంలో మాత్రం లావణ్య అనేక వివాదాల్లో ఇరుక్కుంది.

Telugu Love, Varun Tej, Lavanyatripathi, Lavanya Tripati-Movie

తెలుగులో హిట్ అయిన 100% లవ్ నీ తమిళ్ లో రీమేక్ చేయాలని భావించగా 2017 లో చాలా ఉత్సాహంతో లావణ్య సైన్ చేసింది.కానీ ఈ సినిమా మొదలయ్యాక షూటింగ్ కి హాజరు కాకపోవడంతో కోలీవుడ్ ఆమెను నిషేధించాలని తీర్మానించింది.

ఇక టాలీవుడ్ విషయానికొస్తే ఆమెకు అనేక మంది హీరోలతో మొదటి సినిమా నుంచి ఎఫైర్ ఉందంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.కాకపోతే ఇటీవల వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నట్టు, మెగా ఇంటి కోడలు కాబోతున్నట్టు ఎన్నో వార్తలు వస్తున్నా వాటిని ఇద్దరూ ఖండించడం లేదు.

Telugu Love, Varun Tej, Lavanyatripathi, Lavanya Tripati-Movie

ఇక ఆమెకు ఇదివరకే పెళ్లయిందని, మూడుసార్లు అబార్షన్ కూడా జరిగిందంటూ ఒక యూట్యూబర్ ఆమెపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తో ఆమె పెళ్లి విషయం మరో మారు మీడియాలో హైలైట్ అయింది.అయితే సదరు వ్యక్తిపై లావణ్య ఏకంగా లీగల్ నోటీసులు పంపించడంతో ఈ వివాదం సర్దుమణిగింది.

ఇక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లావణ్య త్రిపాఠి కులం ఆధారంగా, మతం ఆధారంగా ఎవరూ పెద్దవారు కాదని, వారి వ్యక్తిత్వం ద్వారానే పెద్దవారు అవుతారంటూ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఆ వివాదానికి పుల్ స్టాప్ పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube