రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కాంబోలో ఒక సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.రెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఎనౌన్స్ మెంట్ కి రౌడీ ఫ్యాన్స్ సూపర్ ఎక్సయిట్ అయ్యారు.
పుష్ప ముందే ఈ సినిమా ప్రకటన రాగా పుష్ప 1 హిట్ అవడంతో సుకుమార్ రేంజ్ మరింత పెరిగింది.పుష్ప 2 తర్వాత సుక్కు విజయ్ తోనే సినిమా చేస్తారని అనుకున్నారు.
కానీ ఆ ప్రాజెక్ట్ దాదాపు క్యాన్సిల్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు.లైగర్ తర్వాత విజయ్ తను చేస్తున్న సినిమాల మీద పూర్తి కమిట్మెంట్ తో ఉన్నాడు.
కథ ఏ కొద్దిగా తేడా కొట్టినా నిర్మొహమాటంగా వద్దని చెప్పేస్తున్నాడట.
సుకుమార్ సినిమా కథ ఇంక ఫైనల్ అవలేదు.
మరోపక్క విజయ్ కి వేరే ఆఫర్లు వస్తున్నాయి.పుష్ప 2 తర్వాత సుకుమార్ విజయ్ తో కన్నా చరణ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట.
ఇప్పటికే ఈ సినిమాకు నిర్మాతలు సెట్ అయ్యారు.రంగస్థలం కాంబోలో మరో క్రేజీ మూవీ రాబోతుందని తెలుస్తుంది.
మరి సుకుమార్ తో విజయ్ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడ్డదా లేదా అసలకే సినిమా క్యాన్సిల్ చేసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.







