రీసెంట్ గా వచ్చిన విక్రం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించిన కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు.శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ మధ్యలో బ్రేక్ పడగా విక్రం హిట్ తో మళ్లీ ఈ మూవీని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు కమల్ హాసన్.
ఇక దీనితో పాటుగా కమల్ హాసన్ మణిరత్నం డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
సినిమాలతో పాటుగా కమల్ ఓ క్లాత్ బ్రాండ్ సిద్ధం చేశారు.కమల్ హాసన్ హౌజ్ ఆఫ్ ఖద్దర్ అంటూ ఒక బ్రాండ్ సిద్ధం చేశారు.ప్రస్తుతం దీని కోసం కమల్ ఓ క్రేజీ ఫోటో షూట్ చేశారు.అనమైన మోడల్స్ తో కమల్ చేసిన ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కమల్ ఖద్దర్ ఫోటో షూట్ క్రేజీగా మారింది.కమల్ ఈ ఫోటోలతో మరోసారి ట్రెండింగ్ లో ఉన్నారు.
కమల్ ఫ్యాన్స్ ఈ ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.







