నందమూరి బాలకృష్ణ ని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు సరి కొత్తగా చూసిన కార్యక్రమం అన్ స్టాపబుల్ ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన రెండవ సీజన్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.గత సీజన్ లో ఒకటి రెండు వారాలు మినహా ఆ తర్వాత వరుసగా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే.
కానీ ఈ సారి మాత్రం ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ విషయం లో ఆహా టీం అలసత్వం ప్రదర్శిస్తుంది అంటూ నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు.బాలయ్య అభిమానులు సీజన్ 2 యొక్క ఎపిసోడ్ 4 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొన శుక్రవారం శర్వానంద్ మరియు అడవి శేష్ లు అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే.నేటి శుక్రవారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ఎపిసోడ్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు దాంతో ఈ వారం ఎపిసోడ్ లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.

వచ్చే వారం కు అయినా ఎపిసోడ్ ఉంటుందా లేదా అంటూ అంత ఆసక్తి ఎదురు చూస్తున్న సమయం లో ఆహా టీం నుండి అధికారికంగా క్లారిటీ వచ్చింది.ఒక ప్రముఖ హీరోయిన్ తో పాటు ఒక సీనియర్ నటి కూడా రేపటి తర్వాత ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.అతి త్వరలోనే అందుకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలుస్తోంది.బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వల్లే ఎపిసోడ్ నాలుగు ఆలస్యం అవుతుంది అంటూ ఆహా టీం కి చెందిన వారు కొందరు మాట్లాడుకుంటున్నారు.
వీరసింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.







