విశాఖ జిల్లాలోని సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.ప్రధాని పర్యటన నేపథ్యంలో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలను అధికారులు తొలగించారు.
బీజేపీ జెండాల తొలగింపుపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.జెండాలను ఎవరు తొలగించమన్నారో చెప్పాలన్నారు.
సోమువీర్రాజు ఆగ్రహంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.దీంతో సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.







