కాంగ్రెస్ భారీ సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది.ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేస్తూ పార్టీ పునరుద్ధరణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సిద్ధమైయ్యారని తెలుస్తోంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత నూతన మార్పులతో కాంగ్రెస్ కనిపిస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత ఏఐసీసీ ప్లీనరీ సెషన్ జరగనుంది.
కాగా ఈ భేటీలో తొమ్మిది వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.దీనిలో భాగంగా పార్టీ తదుపరి కార్యాచరణపై ఏఐసీసీ ప్లీనరీ నిర్ణయం తీసుకోనున్నారు.
పాదయాత్ర తర్వాత కొత్త ఆలోచనలను రాహుల్ పార్టీతో పంచుకోనున్నారు.ఇప్పటికే రాష్ట్రాల నుంచి వివరణాత్మక నివేదికలను కోరారు ఖర్గే.
ప్రతి ఎన్నికలకు ముందు ఎన్నికల నిర్వహణ విభాగం ఏర్పాటు కానుంది.అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాల కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేయనుంది.
ఒక వ్యక్తి -ఒకే పదవి అమలు చేయనుంది.అణగారిన వర్గాల నుంచి కొత్త నాయకత్వాన్ని సృష్టించడం కోసం లీడర్ షిప్ మిషన్ ఏర్పాటు చేయనుంది.







