టాలీవుడ్ ఇండస్ట్రీ కి స్వర్గీయ ఎన్టీఆర్ తొలిసారి నటించి పరిచయం అయినా సినిమా మన దేశం. ఈ సినిమా 1949 లో విడుదల అవ్వగా చిత్తూర్ నాగయ్య హీరో గా నటించాడు.
ఎన్టీఆర్ పోలీస్ గా చిన్న పాత్రలో నటించగా ఈ చిత్రానికి హీరోయిన్ సి కృష్ణవేణి. ఈ సినిమా తర్వాత ఆమె చాల పాపులర్ హీరోయిన్ గా ఎదిగారు.
ఇక కృష్ణవేణి తొలిసారి సతీ అనసూయ అనే సినిమా ద్వారా తొలిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది.ఈ అవకాశం కృష్ణవేణి కి లభించడానికి గల కారణం రేలంగి వెంకట్రామయ్య.
అయన నాటకాలను ప్రొడ్యూస్ చేసేవారు.అందువల్ల అయన నాటకాల్లో కృష్ణవేణి నటించేది.
ఆ పరిచయం తో రేలంగి వెంకట్రామయ్య పుల్లయ్య గారికి కృష్ణవేణి ని పరిచయం చేసారు.
సి పుల్లయ్య మొదటి సారి రేలంగి వెంకట్రమయ్య నిర్మాణం లో వచ్చిన రామదాసు అనే నాటిక కు వెళ్లారు.
అక్కడ కమల పాత్రా చేస్తున్న కృష్ణవేణి ని చూసారు అయన.ఆ తర్వాత కొన్ని రోజులకు రేలంగి గారి దావ్రా మద్రాసు కి కృష్ణ వేణి ని పిలిపించుకున్నారు.అక్కడే స్టూడియోలోనే ఉంచుకొని ఆమెకు ఆలా సతీ అనసూయ లో వేషం ఇచ్చారు.ఆ తర్వాత రోజుల్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.కేవలం 13 ఏళ్లకే హీరోయిన్ గా మారిన కృష్ణ వేణి ఆ తర్వాత భోజ కాళిదాసు సినిమాలో కన్నాంబ మొదటి హీరోయిన్ గా నటిస్తే కృష్ణ వేణి రెండో హీరోయిన్ గా నటించారు.ఈ సినిమాను మీర్జాపురం రాజా వారు నిర్మించారు.
ఆ తర్వాత కచదేవాయని లో దేవయాని పాత్రలో నటించింది కృష్ణవేణి.

అనే తన జీవితం మొత్తం జయ ఫిలిమ్స్ వారి దగ్గరే ఉండిపోయింది.ఆలా వారి సినిమాల్లో నటిస్తూనే మీర్జాపురం రాజా వారికి రెండవ భార్యగా వెళ్ళింది.పెళ్లయ్యాక సైతం వారి సొంత సినిమాల్లో నటించింది.
కొన్నేళ్ళకు రాజావారు కాలం చేసారు. రాణి గా వెలిగిన కృష్ణ వేణి కి అప్పటి వరకు ఏ లోటు లేకపోయినా రాజరికపు వ్యవస్థ చచ్చిపోవడం తో వారి ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం హస్తగతం చేసుకుంది.
దాంతో ఆమె తమిళనాడు ప్రభుత్వం పై కోర్ట్ లో కేసు వేశారు.ఇప్పటికి ఆలా కోర్ట్ ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ప్రస్తుతం విజయవాడ లో ప్రభుత్వం కట్టిన గన్నవరం ఎయిర్పోర్ట్ అంత కూడా మీర్జాపురం రాజావారి భూమే.
విమానాశ్రయం కట్టడానికి ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు రాజావారు.







