గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చికోటి ప్రవీణ్ కలిశారు.ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజాసింగ్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజాసింగ్ ను కలిసిన చికోటి.ఆయనకు తన మద్ధతు ఉంటుందని తెలిపారు.
హిందూ ధర్మం కోసం పోరాడే వారికి అండగా ఉంటానని చెప్పారు.ఈడీ కేసులకు భయపడనన్న ఆయన తన వ్యాపారం తాను చేసుకుంటానన్నారు.
ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఆలోచన లేదన్నారు.సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీ చేస్తా అనేది పుకార్లు మాత్రమేనని, ఆర్జీవీ తన కథను సినిమాగా తీయాలనే ఆలోచనలో ఉన్నారని వెల్లడించారు.







