జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి తమ సత్తా చాటుకోవాలని గత కొంతకాలంగా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.బిజెపికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాడేందుకు బీ ఆర్ ఎస్ అనే పార్టీని స్థాపించారు ఇంకా దానికి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బాగా బలహీనం కావడంతో, బిజెపికి ప్రత్యయం లేకుండా పోయింది.దీంతో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేసీఆర్ తహతహలాడుతున్నారు.
బిజెపికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా ప్రకటనలు చేయడమే కాకుండా , బిజెపి వ్యతిరేక పార్టీలన్నీటిని ఏకం చేసి తమకు మద్దతు ఇచ్చేలా చూసుకుంటున్నారు.
ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపొందడంతో , దేశవ్యాప్తంగా కేసీఆర్ కు క్రేజ్ పెరిగింది.
బిజెపిని ఢీకొట్టగల సమర్ధుడైన నాయకుడిగా కెసిఆర్ గుర్తింపు పొందారు.ఆ ఉత్సాహంతోనే బిజెపిపై మరింత దూకుడు పెంచేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.వచ్చే నెలలో గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.ఇప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది.
గుజరాత్ లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను పోటీకి దించుదామని కేసీఆర్ ప్లాన్ చేసినా… సమయం ఎంతో లేకపోవడంతో వెనక్కి తగ్గారు.ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుండడంతో, ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే పార్టీకి చెందిన కొంతమంది నాయకులు బృందం అక్కడ వాస్తవ పరిస్థితులను అంచనా వేసే పనుల్లో ఉన్నాయి.ఇది ఇలా ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గుజరాత్ తో పాటు, కర్ణాటక ,ఆంధ్ర ప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తమ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు .ఏ ఏ నియోజకవర్గాల్లో తమకు విజయవకాశాలు ఉంటాయనే దానిపైన ఆయన రహస్యంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం.వివిధ రాష్ట్రాల్లో టిఆర్ఎస్ ను పోటీకి దించి, వందకు పైగా స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి దించి బిజెని కోలుకోలేని దెబ్బ కొట్టాలనే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారట.







