సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలను లైన్లో పెట్టి వాటిని పూర్తి చేసుకుంటూ వస్తుంది.మరి ఈమె నటించిన లేటెస్ట్ సినిమాల్లో ‘యశోద’ సినిమా ఒకటి.
ఈ సినిమా మరొక రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నవంబర్ 11న రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పడంతో ఈ సినిమా కోసం సామ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
ఇక ఈ సినిమా దగ్గర పడడంతో ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్.ఒకవైపు సమంత మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతున్న కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.
ఇక తాజాగా ఈ సినిమా డైరెక్టర్స్ హరి – హరీష్ ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

వీరు మాట్లాడుతూ.సమంత గురించి మాత్రమే కాకుండా సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు.తమిళ్ లో నాలుగు సినిమాలు చేసిన తాము తెలుగులో ఈ సినిమాతో పరిచయం అవుతున్నాం అని తెలిపారు.
అసలు ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో చేయాలని అనుకున్నాం కానీ నిర్మాత కథ విని ఇది భారీ బడ్జెట్ తో ఎందుకు చేయకూడదు అని అన్నారు.

అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాం.సరోగసి సినిమాలో ప్రధాన ప్లాట్ కాదని సినిమాలో అంతకుమించిన అంశాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.ఇక సమంత ఎంత పెద్ద సీన్ అయినా రెండు నిముషాలు టైం తీసుకుని వెంటనే చేసేస్తారని.
ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా గ్లిజరిన్ అనేది వాడకుండా చేసారని తెలిపింది.ప్రతీ 20 నిముషాలకు ఒక మూవ్ ఉంటుంది అని సర్ప్రైజ్ లతో పాటు షాక్ కూడా అవుతారని తెలిపారు.
చూడాలి ఈ సినిమాలో ఎంత విషయం ఉందో.







