బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఈ ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
అంతేకాకుండా పెళ్లి అయిన రెండు నెలలకే తాను గర్భవతిని అంటూ అలియా గుడ్ న్యూస్ తెలిపింది.కాగా తాజాగా ఈ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.
ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అలియా భట్ ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.దీంతో ఒక్కసారిగా అలియా అలాగే రణ్‌బీర్ ఇంట్లో సందడి నెలకొంది.
అయితే అలియా భట్ కు పాప పుట్టింది అన్న విషయం సోషల్ మీడియా వేదిక ప్రకటించడంతో అభిమానులు, సన్నిహితులు స్నేహితులు అలాగే బాలీవుడ్ సెలబ్రిటీలు ఆ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.అయితే ఈ జంట పాప పుట్టింది అని ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఆ పాపకు సంబంధించిన ఫోటో మాత్రం బయటకు రాలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఒక మహిళ చిన్న బేబీని ముద్దాడుతూ కనిపిస్తోంది.అయితే ఆమె చూడటానికి అలియా భట్ లా కనిపిస్తోంది.

ఆ వీడియోలో ఉన్నది అలియా భట్టీ అంటూ పలువురు కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు మాత్రం ఆ వీడియో ఎవరో కావాలనే మార్ఫింగ్ చేశారు ఆ వీడియోలో ఉన్నది అలియా భట్ కాదు అని అంటున్నారు.మరి ఈ విషయంపై అలియా భట్ దంపతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.కాగా పలువురు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ అభిమానులు పాపకు సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.







