Karnataka TET Exam: హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫోటో.. కర్ణాటక సర్కార్ పై విమర్శల పోరు!

కొన్ని కొన్ని సార్లు పొరపాటులు జరుగుతూ ఉంటాయి.సామాన్యంగా పొరపాట్లు ఎవరైనా చేస్తుంటారు.

 Sunny Leone Photo On Karnataka Tet Admit Card, Karnataka Teachers Eligibility Te-TeluguStop.com

అవి చిన్నవి కాని.పెద్దవి కానీ.

చిన్నవి చేసినప్పుడు అంతగా ఏమీ ఇబ్బందులు ఉండవు.కానీ పెద్ద పెద్ద పొరపాట్లు చేసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది ఎదురవుతాయి.

అయితే మనుషుల ద్వారా పొరపాట్లు జరుగుతూ ఉండటం అనేది సహజం.కానీ ఆన్లైన్ ద్వారా కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.

ఆన్లైన్ ద్వారా జరిగే పొరపాటు చూస్తే మాత్రం అవి పెద్ద పరిణామాలకే దారితీస్తాయి.చాలావరకు విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ విషయంలో, హాల్ టికెట్ విషయాలలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.

దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇటువంటివి గతంలో చాలా జరిగాయి.ఇటీవలే కూడా ఒక విద్యార్థిని హాల్ టికెట్లో ఐశ్వర్యరాయ్ ఫోటో రావటంతో వెంటనే ఆ విద్యార్థిని పై అధికారులకు తెలపటంతో ఆ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత వాళ్లు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని వెంటనే ఆ విద్యార్థిని ఫోటోను ఉండేలా చేశారు.

అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితినే మరో విద్యార్థినికి ఎదురయింది.ఇంతకీ అసలేం జరిగిందంటే.

ప్రస్తుతం కర్ణాటకలో టీచర్ రిక్రూమెంట్ పరీక్షలు జరుగుతున్నాయి.దీంతో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం హాల్ టికెట్లు జారీ చేయగా అందులో ఒక యువతికి ఇచ్చిన హాల్ టికెట్ లో యువతికి ఫోటో బదులు పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఫోటో ఉంది.

ఆ ఫోటో చూడటానికి మామూలుగా కూడా.చాలా ఓపెన్ గా ఉంది.దీంతో వెంటనే ఆ యువతి తన ఫోటో బదులు హీరోయిన్ ఫోటో ఉందని తన ట్విట్టర్ వేదికగా ఆ హాల్ టికెట్ పెట్టి షేర్ చేసింది.దీంతో ఆ హాల్ టికెట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక వెంటనే కర్ణాటక కాంగ్రెస్ ఈ విషయం గురించి స్పందించగా అందులో బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది.అంతేకాకుండా నెటిజన్లు కూడా ప్రభుత్వం, బీజేపీపై బాగా విమర్శలు చేస్తున్నారు.

ఇక కర్ణాటక నేత కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి హాల్ టికెట్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ పై బాగా విమర్శలు గుప్పిస్తున్నారు.దీంతో వెంటనే కర్ణాటక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.

ఇక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు ఎదురవుతున్నాయి.

అసెంబ్లీలో బ్లూ ఫిలింలు చూసే మంత్రులు ఉండగా ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలము అంటూ కాంగ్రెస్ నేత చైర్ పర్సన్ బి ఆర్ నాయుడు ప్రశ్నించాడు.ఇక బీజేపీ నేతలకు సన్నిలియోన్ చూడాలనుకుంటే ఆమె ఫోటోను వేలాడదీయం అంటూ అంతేకానీ విద్యాశాఖకు ఎందుకు ఉపయోగించడమని ప్రశ్నిస్తున్నారు.ఇక నెటిజన్స్ కూడా ఈ నిర్లక్ష్యం పై బాగా ఫైర్ అవుతున్నారు.

తర్వాత విద్యాశాఖ పొరపాటు తెలుసుకొని ఈ ఫోటోలు అప్లోడ్ చేస్తామని వివరణ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube